PDPL: 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ధర్మారం మండల స్థాయి గ్రామసభ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, యువజన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10 గంటలకు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.