MNCL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.