BDK: సారపాక ఐటీసీ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫైర్ పైప్లైన్కు లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ముసలమడుగు గ్రామానికి చెందిన వ్యక్తిగా మృతుడిని గుర్తించారు. ఘటనతో పైప్లైన్ పగిలి నీరు ఎగిసి పడుతోంది. మృతుడి బంధువులు ఐటీసీ గేటు ముందు నిరసనకు సిద్ధమవుతుండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.