ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి గురువారం పర్యటించారు. ఆయా కాలనీలలో డ్రైనేజీల నిర్వహణ, చెత్త సేకరణను గురువారం పరిశీలించారు. రహదారుల స్వీపింగ్, తడి/పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులను తనిఖీ చేస్తూ, కార్మికుల హాజరును పరిశీలించారు. పారిశుధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.