‘రాజీవ్ యువవికాసం’ పథకం తమ బతుకుల్లో వెలుగు నింపుతుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కల్పించే భరోసాతో బతుకులు చక్కదిద్దుకుందామనుకున్న యువతకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం త్వరగా అడుగులు వేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తై ఏడాది అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.