KKD: పిఠాపురంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సాధారణ చికెన్ కిలో రూ.180 ఉండగా, స్కిన్లెస్ రూ.250-280, స్కిన్ చికెన్ రూ.240గా ఉంది. బోన్లెస్ కిలో రూ.300, నాటుకోడి రూ.400-450 వరకు పలుకుతోంది. నాణ్యతను బట్టి ధరల్లో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు.