BHPL: జిల్లాలో పలు గ్రామాల్లో వేసవి కాలంలో పంటల సేకరణ పనులు గ్రామీణులకు ఉపాధి కల్పించేవి. అయితే ప్రస్తుతం మొక్కజొన్న పంటల కోతకు యంత్రాల వినియోగం పెరగడంతో కూలీలకు పనులు తగ్గిపోయాయి. దీంతో అనేక మంది గ్రామీణులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.