MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హోటల్ యజమాని జోడు జయరాం (46) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మేడ్చల్ జిల్లాకు చెందిన జయరాం ముప్పిరెడ్డిపల్లి శివారులో హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ వ్యాపారంలో నష్టాలు రావడం, అనారోగ్యం కారణంగా మధ్యాహ్నం హోటల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.