NLG: నకిరేకల్‌లో జూన్ 3న జరగనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో మంగళవారం మహాసభ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.