NLG: దేవరకొండ మండలం కమలాపురం గ్రామ మాజీ ఉప సర్పంచ్ రేపని పద్మ యాదయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.