NZB: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రూరల్ MLA డా. భూపతి రెడ్డి సూచించారు. రానున్న రోజుల్లో నిజామాబాద్‌తో సహా ఇతర జిల్లాల్లో ఎండలతీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు.