JGL: విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని ప్యానల్ బృందం సందర్శించింది.తరగతి గదులకు వెళ్లి బోధన తీరును, విద్యార్థుల మార్కుల జాబితాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో హెచ్ఎం, ఎస్ఓ, తనిఖీ బృందం సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.