NGKL: తిమ్మజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే.శ్రీమతి చర్లకొల శ్వేత గారి స్మారకార్ధం నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంటును ఇవాళ మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ టోర్నీలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 35 టీంలు పాల్గొన్నాయి. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.