KNR: కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మేయర్ క్యాంప్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సంజయ్ మాట్లాడుతూ.. ఈ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు.