HYD: ఫొటో జర్నలిస్టుల శ్రమ ఎప్పటికి వెలకట్టలేనిదని INTUC వైస్ ప్రెసిడెంట్ మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణా ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫొటో అవార్డు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.