LSGతో మ్యాచ్లో డకౌట్ కావడంతో అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ (17), రహానే (16), గంభీర్ (15), ధావన్ (15) తర్వాత 14 డకౌట్లతో అభిషేక్ నిలిచాడు. అలాగే, ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్గా రోహిత్ (6) సరసన అగ్రస్థానంలో నిలిచాడు.