కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహార నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో విద్యాసంస్థలలో నాణ్యమైన భోజన సరఫరాపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద న్యాయనిర్ణేత అధికారిగా చట్టాన్ని అమలు చేయాలన్నారు.