నల్లగొండ మండలం వెలుగుపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పోతేపాక వినోద్ కుమార్, ఉపసర్పంచ్ జూలకంటి పద్మ, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.