VKB: శివరాంనగర్ కాలనీ దర్గా వద్ద ఒక పండితుడు తన హోండా షైన్ (TS34F9519) బైక్ను ఇంటి ముందు పార్క్ చేసి పంచాంగం చెప్పడానికి లోపలికి వెళ్లారు. కొద్ది సేపటిలో బయటకు వచ్చి గమనిస్తే బైక్ దొంగిలించబడినది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికులను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.