KDP: చెన్నూరు మండలానికి చెందిన గొడ్లవీటి ఈశ్వరయ్యకు కడప పోక్సో కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.