JGL : చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న (మంగళవారం) బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయం మూసివేస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9గం.లకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తామని, భక్తులు గమనించగలరని ఈఓ అన్నారు.