KMM: రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలని ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు అన్నారు. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్చి మార్కెట్కు వచ్చే రైతులకు, ట్రాలీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.