KNR: మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూడెం లక్ష్మీ డిమాండ్ చేశారు. బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై వివక్ష, వేధింపులు అరికట్టాలని, చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.