ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెన్షన్ లబ్ధిదారుల లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియ కౌంటర్‌ను సోమవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల వివరాల నిర్ధారణలో భాగంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తప్పనిసరిగా లబ్ధిదారులు వివరాలు ఇవ్వాలన్నారు.