KMR: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక కార్మికులను నకిలీ వీసాలతో మోసం చేస్తున్న మధ్యవర్తులపై ఉక్కుపాదం మోపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ వీసాలు, తప్పుడు హామీలతో డబ్బులు వసూలు చేసి విదేశాలకు పంపి కార్మికులను కష్టాల పాలు చేస్తున్న దళారులపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.