MDCL: ఉప్పల్ జోన్ బోడుప్పల్ వార్డులో జలమండలి విజిలెన్స్ అధికారులు అక్రమంగా నల్లాలకు బిగించిన 12 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, ప్రశాంత్‌నగర్ ప్రాంతాల్లో పైపులైన్లకు నేరుగా మోటార్లు అమర్చి నీటిని తోడుతున్నట్లు గుర్తించారు. మళ్లీ ఇలా చేస్తే రూ.5 వేల జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.