KMR: గత ఏడాది వరదలతో దెబ్బతిన్న నాగిరెడ్డిపేట్ (సరంపల్లి) గిరిజన గురుకుల పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ పునరుద్ధరణకు గ్రీన్కో ఫౌండేషన్ అండగా నిలిచింది. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో బుధవారం నూతన కంప్యూటర్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్కు మరియు గ్రీన్కో ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.