SDPT: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో వెలిసిన 12వ శతాబ్దం నాటి శ్రీ చండీ సమేత కాలభైరవ స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. దట్టమైన అడవిలో స్వయంభువుగా వెలిసిన ఉగ్రరూప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో పూజలు చేస్తే దుష్టశక్తులు, అపమృత్యు భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.