KMR: నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో వైద్య సిబ్బంది ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఇవాళ నిర్వహించారు. భోజనం వికటించి అస్వస్థతకు గురైన 46 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎనిమిది మంది విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించగా, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని మండల వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు.