PDPL: పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో రూ.20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.