HNK: హన్మకొండ నగరంలో ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ అడ్మిషన్ల ఇప్పిస్తానని చెప్పి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి రూ. 14.81 లక్షలు వసూలు చేసిన మహిళను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు హన్మకొండ సీఐ శివ కుమార్ తెలిపారు. కటకం స్వర్ణ రాణి అడ్మిషన్లు కల్పిస్తానని నమ్మించి 12 మంది విద్యార్థులను మోసం చేసిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.