KNR: చిగురుమామిడి మండలం పీచుపల్లి, రేకొండలో మిడ్ మానేరు కాలువకట్ట తెగి రోజులు గడుస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు కట్టకు గండి పడటంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.