MNCL: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లిలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడెకరాలలోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చి, మిగతా రైతులకు అన్యాయం చేశారని తెలిపారు.