MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో దోమల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి దోమల నియంత్రణకు మండల కేంద్రంలో ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మండల ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.