NZB: భానుడు భగ్గుమంటున్నా.. చల్లని అలల తాకిడిలో సేదతీరాలనుందా? అయితే ఆలస్యం చేయకుండా శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్స్కు పయనమవ్వండి. నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఎటుచూసినా అంతులేని జలరాశి, సముద్రాన్ని తలపించే తీరంతో ఇక్కడ మనకు ‘మినీ గోవా’ అనుభూతి కలుగుతుంది. ఇసుక తిన్నెలపై కూర్చొని, సూర్యాస్తమయ వేళలో నీటి అలల గలగలలు వింటూ గడపడం ఒక మధురానుభూతి.