ADB: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద గల ఖాన్ బేకరీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తున్న ఫైజల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 30 లీటర్ల పెట్రోల్, విక్రయానికి సిద్ధంగా ఉన్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.