NRPT: ధన్వాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లిన ఖాదర్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెంకటేష్ గౌడ్ తెలిపారు. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.