ADB: ఇంద్రవెల్లి మండలం వాల్గొండలో మిషన్ భగీరథ నీటి సమస్య జటిలమైంది. గ్రామంలో 160 ఇళ్లు ఉండగా 10 ఇళ్లకు మాత్రమే అరకొరగా నీళ్లు అందుతున్నాయి. మిగిలిన 150 ఇళ్లకు నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. ఇంటింటికీ నల్లా ఇస్తామన్న హామీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.