SDPT: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై బాధిత రైతులను కలిసేందుకు వెళ్లడాన్ని అడ్డుకున్నారు. ఈ మేరకు హరీశ్ రావు నివాసం వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించారు. అలాగే మాజీ మంత్రి సబితతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు.