ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం సిర్పూర్ (టి)లో అత్యధికంగా 39.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌లో 39.4°C, బెజ్జూర్‌లో 39.3°C గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.