BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. గత సంవత్సరం మూడో నెలలో స్థానిక ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. వెంటనే అధికారులు, స్థానిక MLA స్పందించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.