SRPT: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో పోలీసు నిఘా పెంచుతున్నట్లు ఎస్పీ నర్సింహా తెలిపారు. హెల్మెట్ లేని వాహనదారులకు మొదటిసారి కౌన్సిలింగ్, రెండోసారి చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, డ్రంకన్ డ్రైవ్లో దొరికినా వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.