MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అల్వాల్ ఫైర్ స్టేషన్ నిర్మాణం, చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, ఓపెన్ జిమ్‌లు, బండ చెరువు అభివృద్ధి, బాక్స్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కమిషనర్‌కు ఆయన వినతిపత్రాలు సమర్పించారు.