NZB: నిన్న జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అట్టహాసంగా సాగినా, క్షేత్రస్థాయిలో అనాగరిక ‘వెలి’వేతలు ఇంకా రాజ్యమేలుతుండటం శోచనీయం. గతంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలను ఊరి నుంచి వెలివేయడం, జిల్లా పరిధిలో ఎన్నికలప్పుడు వేరే వారికి మద్దతు తెలిపారని కొన్ని కుటుంబాలకు నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.