MDK: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడ్డి మందు విక్రయాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రైతులు గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపే ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.