MNCL: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాలుష్యం నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని జైపూర్ మండలం పెగడపల్లి గ్రామస్తులు మంత్రి వివేక్కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే పెగడపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని, తగిన రక్షణ చర్యలు చేపట్టేలా చూడాలన్నారు.