SRPT: విజయవాడలో జరిగిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. యండి షగుఫ్తకు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్, పలువురికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. గురువు దాసరి యల్లయ్య సన్మానింపబడ్డారు. బాల్ భవన్లో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.