MHBD: తొర్రూరు వ్యవసాయ మార్కెట్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు.