NRPT: మక్తల్ పట్టణంలో నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ లోపు నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు.