JN: జఫర్గఢ్ మండలం నుంచి సాగరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.